రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : అర్వింద్ ధర్మపురి

సీఎం రేవంత్ రెడ్డి రైతులతో మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాడని బిజెపి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి ధ్వజమెత్తారు.

Update: 2024-05-06 15:10 GMT

దిశ, బోధన్ : సీఎం రేవంత్ రెడ్డి రైతులతో మోసపూరిత రాజకీయాలు చేస్తున్నాడని బిజెపి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి అర్వింద్ ధర్మపురి ధ్వజమెత్తారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను, మహిళను, యువకులను మోసం చేసిందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయి మోదీ ప్రభుత్వం రావాలని మహిళలు రెండు నిమిషాలు దేవుడికి మొక్కాలని తెలిపారు.

తాను ఇచ్చిన మాట ప్రకారం జిల్లాలో రెండు కేంద్రీయ విద్యాలయాలు, 7 రైల్వే ఓవర్ బ్రిడ్జి లు, పసుపు బోర్డు తెచ్చానని, పసుపు ధర 20 వేల వరకు వచ్చేలా చేశానని తెలిపారు. తాను గెలిచిన నెల రోజుల్లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ని తెరిపిస్తానని, సీఎం రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీ రేటు ఎంతనో చెబితే ఇతరులతో కొనిపించి తెరిపిస్తానని హామీ ఇచ్చారు. తాను గెలిచిన 3 నెలల తరువాత కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేలా ఒత్తిడి తెస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు రేషన్ కార్డుతో ముడిపడి ఉన్నాయని తెలిపారు.

500 సంవత్సరాల తర్వాత త్రేతాయుగంలో రాముడిని అయోధ్య లో ప్రాణప్రతిష్ఠ నిర్వహించిన యుగపురుషుడు నరేంద్ర మోదీ అని తెలిపారు. కరోనా సమయంలో 140 కోట్ల భారతీయులకు 2 డోసుల వ్యాక్సిన్ ఇవ్వడమే కాకుండా 150 దేశాలకు వ్యాక్సిన్ సప్లై చేసి భారతదేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటుతున్నాడని, మోదీ నాయకత్వంలో భారత్ విశ్వ గురువు గా మారిందని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా పేదవారికి ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నాడని, మహిళ సంఘాల మహిళలకు వేల కోట్ల ఋణాలు, 5%వడ్డీ రాయితీ మోదీ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో 10 పైసల వడ్డీ కే ఋణాలు అందిస్తున్నామని తెలిపారు. మహిళకు ఉజ్వల పథకంలో భాగంగా ఉచిత గ్యాస్ సిలెండర్లు అందించామని, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఉచిత వైద్య సేవలు, రైతులకు ఎకరాల 18 వేల రసాయన ఎరువుల సబ్సిడి ఇస్తున్నాడని తెలిపారు.

అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. కల్యాణ లక్ష్మీ లో తులం బంగారం, 4వేల ఫించన్, 500 ల బోనస్, రైతుబంధు లాంటి హామీలు అమలు చేయలేదని విమర్శించారు. గతంలో కేసీఆర్ మోసం చేసి వెళ్లాడని, ఇప్పుడు రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని అన్నారు. నరేంద్రమోదీ నిద్ర హారాలు మాని దేశ అభివృద్ధి కై పాటుపడుతున్న నరేంద్ర మోదీ ని మరోసారి ప్రధాని కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ బంధువులకు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి ఓటింగ్ శాతం పెరిగేలా చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి, మెడపాటి ప్రకాష్ రెడ్డి, నర్సింహ రెడ్డి, మ్యాక సంతోష్, కిషోర్, యోగేష్, ఎడపల్లి, రెంజల్ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Similar News