అర్జున అవార్డుకు ఇషాంత్ నామినేట్

దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ (Team India pacer Ishant Sharma) అర్జున అవార్డు (Arjuna Award)కు నామినేట్ అయ్యాడు. ఈ అవార్డుకు క్రీడా మంత్రిత్వ శాఖ (Ministry of Sports)నామినేట్ చేసింది. ఈ అవార్డు కోసం ఇషాంత్‌తోపాటు మరో 28 మంది క్రీడాకారులను సెలెక్షన్ కమిటీ సిఫార్సు చేసింది. 31 ఏళ్ల ఇషాంత్ ఇప్పటి వరకు టీం ఇండియా తరఫున 97 టెస్టులు, 80 వన్డేలు ఆడాడు. ఇప్పటి వరకు 400 […]

Update: 2020-08-18 08:24 GMT

దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా పేసర్ ఇషాంత్ శర్మ (Team India pacer Ishant Sharma) అర్జున అవార్డు (Arjuna Award)కు నామినేట్ అయ్యాడు. ఈ అవార్డుకు క్రీడా మంత్రిత్వ శాఖ (Ministry of Sports)నామినేట్ చేసింది. ఈ అవార్డు కోసం ఇషాంత్‌తోపాటు మరో 28 మంది క్రీడాకారులను సెలెక్షన్ కమిటీ సిఫార్సు చేసింది.

31 ఏళ్ల ఇషాంత్ ఇప్పటి వరకు టీం ఇండియా తరఫున 97 టెస్టులు, 80 వన్డేలు ఆడాడు. ఇప్పటి వరకు 400 అంతర్జాతీయ వికెట్లు తీశాడు. కాగా, నామినేట్ అయిన వారిలో ఆర్చర్ అతాను దాస్, హాకీ క్రీడాకారిణి దీపిక ఠాకూర్, క్రికెటర్ దీపక్ హుడా, టెన్నిస్ ప్లేయర్ ద్విజి శరణ్‌లు ఉన్నారు. రెజ్లర్ సాక్షి మాలిక్, వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చానులను కూడా ఈ అవార్డుకు పరిశీలించారు. అయితే, వీరిద్దరూ గతంలో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు (Rajiv Khel Ratna)లను గెలుచుకోవడంతో అంతిమ నిర్ణయాన్ని క్రీడా మంత్రి కిరణ్ రిజిజుకి సెలెక్షన్ కమిటీ వదిలేసింది.

Tags:    

Similar News