ఎట్టకేలకు లాభాలను దక్కించుకున్న మార్కెట్లు!

దిశ, వెబ్‌డెస్క్: వరుస నష్టాలతో కుదేలైన దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం ఎట్టకేలకు స్వల్పంగా లాభాలను దక్కించుకున్నాయి. ముఖ్యంగా మెటల్, రియల్ ఎస్టేట్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో రంగాల మద్దతుతో వరుస ఐదు రోజుల నష్టాల నుంచి సూచీలు బయటపడ్డాయి. ప్రధానంగా మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ కౌంటర్లలో భారీగా కొనుగోళ్ల మద్ధతు లభించింది. బ్యాంకింగ్ మినహా అన్ని రంగాల కౌంటర్లు లాభాల్లోనే ముగిశాయని విశ్లేషకులు తెలిపారు. అలాగే, ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడవ్వడంతో […]

Update: 2021-02-23 06:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: వరుస నష్టాలతో కుదేలైన దేశీయ ఈక్విటీ మార్కెట్లు మంగళవారం ఎట్టకేలకు స్వల్పంగా లాభాలను దక్కించుకున్నాయి. ముఖ్యంగా మెటల్, రియల్ ఎస్టేట్, ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో రంగాల మద్దతుతో వరుస ఐదు రోజుల నష్టాల నుంచి సూచీలు బయటపడ్డాయి. ప్రధానంగా మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ కౌంటర్లలో భారీగా కొనుగోళ్ల మద్ధతు లభించింది. బ్యాంకింగ్ మినహా అన్ని రంగాల కౌంటర్లు లాభాల్లోనే ముగిశాయని విశ్లేషకులు తెలిపారు. అలాగే, ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో ట్రేడవ్వడంతో ఆ ప్రభావం సానుకూలంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ స్వల్పంగా 7.09 పాయింట్లు లాభపడి 49,751 వద్ద ముగియగా, నిఫ్టీ 32.10 పాయింట్ల లాభంతో 14,707 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్, రియల్టీ రంగాలు పుంజుకోగా, బ్యాంకింగ్, ఫైనాన్స్, టెలికాం రంగాలు డీలాపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఓఎన్‌జీసీ అధికంగా 5.55 శాతం ఎగసింది. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, ఆల్ట్రా సిమెంట్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ షేర్లు లాభాలను దక్కించుకోగా, కోటక్ బ్యాంక్ అధికంగా 3.87 శాతం పతనమైంది. మారుతీ సుజుకి, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.73గా ఉంది.

Tags:    

Similar News