సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఎస్ఈసీ అప్పీలు

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో ఇతర ముద్రల ఓట్లపై సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై ఎస్ఈసీ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఎస్ఈసీ అప్పీలుపై విచారణ జరిపిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నెరేడ్ మెట్‌లో ఫలితం నిలిచిపోయిందని కోర్టుకు ఎస్ఈసీ తెలియజేయగా.. సిబ్బందికి శిక్షణ లోపమే కారణమని హైకోర్టు అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి వద్ద సోమవారమే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. […]

Update: 2020-12-05 02:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో ఇతర ముద్రల ఓట్లపై సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులపై ఎస్ఈసీ హైకోర్టులో అప్పీల్ చేసింది. ఎస్ఈసీ అప్పీలుపై విచారణ జరిపిన ధర్మాసనం.. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. నెరేడ్ మెట్‌లో ఫలితం నిలిచిపోయిందని కోర్టుకు ఎస్ఈసీ తెలియజేయగా.. సిబ్బందికి శిక్షణ లోపమే కారణమని హైకోర్టు అభిప్రాయపడింది.

సింగిల్ జడ్జి వద్ద సోమవారమే విచారణ ఉన్నందున అత్యవసరంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. సింగిల్ జడ్జి విచారణ పూర్తయ్యాక అభ్యంతరాలపై అప్పీలు చేయాలని హైకోర్టు సూచించింది. సోమవారం ఉదయమే ఈ అంశంపై విచారణ జరపాలని సింగిల్ జడ్జిను ధర్మాసనం ఆదేశించింది.

Tags:    

Similar News