కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి!.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ డిమాండ్

మీరు అధికారం కోసం ఎంత ఆకలితో ఉన్నారో తెలంగాణ మొత్తానికి తెలుసని, తక్షణమే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు.

Update: 2024-05-02 08:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మీరు అధికారం కోసం ఎంత ఆకలితో ఉన్నారో తెలంగాణ మొత్తానికి తెలుసని, తక్షణమే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డికి ఏ నోటీసులు రాలేదని రాజకీయాల కోసం ఇదంతా చేస్తున్నాడని కేటీఆర్ అన్న మాటలకు బల్మూరి వెంకట్ స్పందిస్తూ.. అందుకు సంబందించిన ఆధారాలు చూపెడుతూ.. ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ప్రియమైన కేటీఆర్ దయచేసి కింద చూడండి.. సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు రాసిన పేపర్ క్లిప్ మీకు కనిపిస్తుందని సూచించారు. అబద్ధాలను ఉమ్మివేసి, నకిలీ సమాచారాన్ని వ్యాప్తి చేసే ముందు, ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అంతేగాక ఆ సమాచారాన్ని ధృవీకరించండి అని అన్నారు.

అధికారం కోసం అంత ఆరాటపడకండి. మీరు అధికారం కోసం ఎంత ఆకలితో ఉన్నారో తెలంగాణ మొత్తానికి తెలుసు! అని, తనపై తప్పుడు ప్రచారం చేసినందుకు మా గౌరవ ముఖ్యమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని ఎక్స్ లో రాసుకొచ్చారు. కాగా సీఎం రేవంత్ రెడ్డికి ఎలాంటి నోటీసులు రాలేదని, అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో వచ్చిన నోటీసుల్లో ఆయన పేరు లేదని అన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం తనకు నోటీసులు వచ్చాయని, తనపై కుట్రలు చేస్తున్నారని తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని, దయచేసి వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాణలు చెప్పాలని ఓ మీడియా చానెల్ తో అన్నారు.

Similar News