హ్యాపీగా ఉందాం : సందీప్ కిషన్

సుశాంత్ సింగ్.. మరణంతో సోషల్ మీడియాలో తన గురించి ఎన్నో పోస్ట్‌లు చూస్తున్నాం. తనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ నటులు, అభిమానులు బాధాకరమైన పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బాధకు ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరుతున్నాడు హీరో సందీప్ కిషన్. సోషల్ మీడియా పోస్ట్‌లు సంతోషంతో నిండి పోవాలని.. సంతోషాన్ని పంచేలా ఉండాలని కోరాడు. కావున రానున్న 24 గంటలు సూపర్ హాపీయెస్ట్‌గా ఉండాలని కోరాడు. పాజిటివిటీ పంచుదామని నెటిజన్లకు పిలుపునిస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ చిన్నారితో ఆడుకుంటున్న […]

Update: 2020-06-17 07:51 GMT

సుశాంత్ సింగ్.. మరణంతో సోషల్ మీడియాలో తన గురించి ఎన్నో పోస్ట్‌లు చూస్తున్నాం. తనతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ నటులు, అభిమానులు బాధాకరమైన పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో బాధకు ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరుతున్నాడు హీరో సందీప్ కిషన్. సోషల్ మీడియా పోస్ట్‌లు సంతోషంతో నిండి పోవాలని.. సంతోషాన్ని పంచేలా ఉండాలని కోరాడు. కావున రానున్న 24 గంటలు సూపర్ హాపీయెస్ట్‌గా ఉండాలని కోరాడు. పాజిటివిటీ పంచుదామని నెటిజన్లకు పిలుపునిస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ చిన్నారితో ఆడుకుంటున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. స్మైల్స్‌తో ఆకట్టుకున్నాడు సందీప్.

చివరగా తెనాలి రామకృష్ణ LLB సినిమాతో ఆకట్టుకున్న సందీప్ కిషన్.. ‘A1 ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ మూవీలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ కాగా.. త్వరలో షూటింగ్ మొదలు కానుంది.

Tags:    

Similar News