ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్.. త్వరలో తెరపైకి ‘క్రిష్ 4’!

బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ నటించిన ‘క్రిష్’ సినిమా గుర్తుండే ఉంటుంది.

Update: 2024-05-04 15:21 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ నటించిన ‘క్రిష్’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఇందులో ప్రియాంక చోప్రా, రేఖ, ప్రీతీ జింటా, నసీరుద్దీన్ షా, మణిని మిశ్ర ఇంకా చాలా మంది స్టార్స్ నటించారు. రాకేష్ రోషన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ షేక్ చేసింది. దీంతో ఈ చిత్రం ఏకంగా మూడు పార్టులుగా తెరెకెక్కిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు తాజా సమాచారం మేరకు.. క్రిష్ 4 కూడా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే.. హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలు మన దగ్గర భారీ విజయాలను అందుకుంటాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఈక్రమంలోనే హృతిక్ ‘క్రిష్’ మూవీ కూడా రికార్డులను బ్రేక్ చేసిందని చెప్పొచ్చు. సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని.. ఇప్పుడు టీవీల్లో వచ్చిన వదిలిపెట్టకుండా చూస్తుంటారు. అలాంటి ఈ చిత్రం ఇప్పటివరకు మూడు పార్టులుగా వచ్చింది. ఇప్పుడు నాలుగో పార్ట్ ‘క్రిష్ 4’ రాబోతుందని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే.. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, ఒకవేళ క్రిష్ 4 వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సిరీస్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Similar News