అది కోత ఇది లేత.. ‘దేవర’ నుంచి వరుస అప్‌డేట్స్.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్ (ట్వీట్)

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’.

Update: 2024-05-18 10:45 GMT

దిశ, సినిమా: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకోగా.. మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇందులో భాగంగా నిన్న ‘దేవర’ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేస్తూ.. ఫస్ట్ సాంగ్ గురించి అప్‌డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంకా ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాకముందే సెకండ్ సింగిల్ గురించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు రామజోగయ్య శాస్త్రి. ఈ మేరకు ‘ఒక్క రోజు ఓపిక పట్టండి.. మన "అని"... అబ్బా... వర్తు వెయిటింగ్.. "అని" పిస్తాడు.. మనందరినోట.. రెండో పాట రికార్డింగ్‌కి వచ్చా చెన్నై. ఇది ఇంకో రకం ప్రకంపనం.. అది కోత ఇది లేత” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ కావడంతో.. ‘దేవర’ నుంచి వరుస అప్‌డేట్స్ రావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

Click Here For Twitter Post..

Tags:    

Similar News