వామ్మో.. మెదక్‌లో అధిక ధరలు

దిశ, మెదక్: మెదక్ మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నామని చెప్పి ప్రకటించిన కూరగాయల వ్యాపారస్తులు ఇదే అదనుగా భావించి పల్లెటూర్ల నుంచి వచ్చే వాళ్ళను పట్టణానికి రాకుండా శివారు ప్రాంతంలో కూరగాయలను ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరమైన కూరగాయలను అధిక ధరలకు అమ్మటం సమంజసం కాదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా వర్తక సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు వారి నిర్ణయాన్ని మార్చుకుని అక్కడ ఒక మూడు ప్రదేశాలు […]

Update: 2020-08-12 04:59 GMT

దిశ, మెదక్: మెదక్ మున్సిపాలిటీ పరిధిలో స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తున్నామని చెప్పి ప్రకటించిన కూరగాయల వ్యాపారస్తులు ఇదే అదనుగా భావించి పల్లెటూర్ల నుంచి వచ్చే వాళ్ళను పట్టణానికి రాకుండా శివారు ప్రాంతంలో కూరగాయలను ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరమైన కూరగాయలను అధిక ధరలకు అమ్మటం సమంజసం కాదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా వర్తక సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు వారి నిర్ణయాన్ని మార్చుకుని అక్కడ ఒక మూడు ప్రదేశాలు చిన్నచిన్నగా ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News