ఇక్కడ పెట్రోల్ తో పాటు చల్లదనం కూడా దొరుకుతుంది!.. బంకు యజమాని వినూత్న ఆలోచన

ఎండ వేడిమిని తట్టుకోవడానికి పెట్రోల్ బంకు యజమాని చేసిన ఆలోచన చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Update: 2024-05-02 12:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఎండ వేడిమిని తట్టుకోవడానికి పెట్రోల్ బంకు యజమాని చేసిన ఆలోచన చూపరులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ ఎండకాలంలో ఉష్టోగ్రతలు 40 డిగ్రీల పైనే ఉంటుండటంతో ప్రజలు బయటకి వెళ్లాలంటేనే ఆలోచిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే పెట్రోల్ కొసం తమ బంకుకు వచ్చే కస్టమర్లకు ఎండ వేడిమి నుంచి కొంత ఊరట కల్పించేందుకు బంకు యజమాని టెక్నాలజీ ఉపయోగించి వినూత్న ఆలోచన చేశాడు. కరీంనగర్ శాతావాహన యూనివర్సిటీ రోడ్డులోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ తో పాటు చల్లదనం కూడా దొరుకుతుంది. ఎండ వేడిని అధిగమించడానికి బంకు యజమాని బంకు చుట్టు వాటర్ మిస్ట్ ఫాగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేయించాడు. దీంతో కస్టమర్లు పెట్రోల్ కొనుగోలు చేస్తున్నప్పుడు చల్లని పొగమంచు తమపై పడుతున్నట్లుగా అనుభూతి చెందుతూ.. ఎండ వేడి నుంచి కొంత ఉపశమనం పొందినట్లు అవుతుంది. వాహానదారులే కాక రోడ్డు వెంట వెళ్లె బాటసారులు సైతం ఆ బంకు వద్ద కాసేపు ఉండి ఉపశమనం పొందుతున్నారు. ఎండ వేడిమిని తట్టుకునేందుకు బంకు యజమాని చేసిన ఐడియాను అందరూ మెచ్చుకుంటున్నారు.


Similar News