రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయం: పార్థసారథి

దిశ, తెలంగాణ బ్యూరో: కౌంటింగ్ సెంటర్ పై రిటర్నింగ్ అధికారులు సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులకు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ… ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుందని, రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమన్నారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలవ్వాలని, సిబ్బంది ఉ. 7.30 వరకే తమకు […]

Update: 2020-12-03 10:35 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కౌంటింగ్ సెంటర్ పై రిటర్నింగ్ అధికారులు సంపూర్ణ ఆధిపత్యం కలిగి ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారులకు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి మాట్లాడుతూ… ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియ అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుందని, రిటర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమన్నారు.

కౌంటింగ్ ఉదయం 8 గంటలకు మొదలవ్వాలని, సిబ్బంది ఉ. 7.30 వరకే తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ పరిశీలించడానికి 30 డీఆర్‌సీ సెంటర్లకు 30 పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాలను పరిశీలకుల ఆమోదం తరువాతనే రిటర్నింగ్ అధికారి ప్రకటించాలన్నారు. మొబైల్ ఫోన్లను కౌంటింగ్ సెంటర్ లోనికి అనుమతించరాదని, ధూమపానం నిషేదమన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో రిలీఫ్ ఏజెంట్లు ఉండరని తెలిపారు. కోవిడ్-19 నిబంధనలు తప్పక పాటించాలని-కౌంటింగ్ సిబ్బంది మాస్క్, ఫేస్ షీల్డ్ తప్పక ధరించాలని తెలిపారు.

Tags:    

Similar News