భైంసా.. 144 సెక్షన్‌లో నాలుగు గంటల సడలింపు

దిశ, ముధోల్: ఇటీవల ఇరువర్గాల ఘర్షణతో బైంసా పట్టణంలో 144 సెక్షన్ అమలు చేసిన విషయం తెలిసిందే. వారం రోజులుగా ఇండ్లకే పరిమితమైన ప్రజలు.. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసరాల కోసం ఇచ్చిన సడలింపుతో పేదలు, సామాన్యులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు కావాల్సిన నిత్యవసర సరుకులు కొనుక్కున్నారు. అన్ని రకాల షాపులు, మార్కెట్లు జనంతో కళకళలాడాయి. ఇంటర్ నెట్ సేవలు నిలిచి పోవడంతో యువత అసహనం వ్యక్తం చేశారు. […]

Update: 2021-03-14 08:23 GMT

దిశ, ముధోల్: ఇటీవల ఇరువర్గాల ఘర్షణతో బైంసా పట్టణంలో 144 సెక్షన్ అమలు చేసిన విషయం తెలిసిందే. వారం రోజులుగా ఇండ్లకే పరిమితమైన ప్రజలు.. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు నిత్యావసరాల కోసం ఇచ్చిన సడలింపుతో పేదలు, సామాన్యులు ఆనందం వ్యక్తం చేశారు. తమకు కావాల్సిన నిత్యవసర సరుకులు కొనుక్కున్నారు. అన్ని రకాల షాపులు, మార్కెట్లు జనంతో కళకళలాడాయి. ఇంటర్ నెట్ సేవలు నిలిచి పోవడంతో యువత అసహనం వ్యక్తం చేశారు. ప్రతినెలా అందే పెన్షన్స్ డబ్బులు తీసుకోలేక వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడ్డారు. వారం తర్వాత నాలుగు గంటల సడలింపు ఇవ్వడంతో ప్రజలకు ఆనందం వ్యక్తం చేశారు.

 

Tags:    

Similar News