ఫిన్‌టెక్ పరిశ్రమలో కొత్త ఆవిష్కరణల అవసరముంది: ఆర్‌బీఐ గవర్నర్!

దిశ, వెబ్‌డెస్క్: సమర్థవంతమైన సేవలను అందించేందుకు ఆర్థిక రంగంలో కొత్త ఆవిష్కరణల అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. గురువారం ప్రారంభమైన ఇండియా ఎకనమిక్ కాన్‌క్లేవ్-2021 కార్యక్రమంలో పాల్గొన్న శక్తికాంత దాస్.. ఫిన్‌టెక్ పరిశ్రమలో ఆవిష్కరణలకు సమర్థవంతమైన నియంత్రణ కావాలని అభిప్రాయపడ్డారు. సంక్షోభ పరిస్థితుల్లో బలమైన మూలధనం ద్వారా బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీల పటిష్ఠతను కాపాడనున్నట్టు దాస్ స్పష్టం చేశారు. 2020లో ఆర్థిక సంక్షోభం చరిత్రలో ఎన్నడూ లేనిదని, భిన్నమైనదని దాస్ […]

Update: 2021-03-25 04:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: సమర్థవంతమైన సేవలను అందించేందుకు ఆర్థిక రంగంలో కొత్త ఆవిష్కరణల అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. గురువారం ప్రారంభమైన ఇండియా ఎకనమిక్ కాన్‌క్లేవ్-2021 కార్యక్రమంలో పాల్గొన్న శక్తికాంత దాస్.. ఫిన్‌టెక్ పరిశ్రమలో ఆవిష్కరణలకు సమర్థవంతమైన నియంత్రణ కావాలని అభిప్రాయపడ్డారు. సంక్షోభ పరిస్థితుల్లో బలమైన మూలధనం ద్వారా బ్యాంకింగ్, ఎన్‌బీఎఫ్‌సీల పటిష్ఠతను కాపాడనున్నట్టు దాస్ స్పష్టం చేశారు. 2020లో ఆర్థిక సంక్షోభం చరిత్రలో ఎన్నడూ లేనిదని, భిన్నమైనదని దాస్ అభిప్రాయపడ్డారు. ఆర్థికవ్యవస్థలోని పలు రంగాల్లో క్షీణత కారణంగా ఆర్థిక రంగం తీవ్రంగా ప్రభావితమైందన్నారు. కరోనా నుంచి ప్రపంచ ఆర్థిక రంగం బయటపడలేదని, కరోనా కొత్త వేరియంట్ వల్ల ఆర్థిక రికవరీకి ఇబ్బందిగా మారినట్టు దాస్ పేర్కొన్నారు. దీని నుండి కోలుకోవాలంటే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల మూలధన పటిష్ఠతను కాపాడటమే ఆర్‌బీఐ తొలి ప్రాధాన్యత అని చెప్పారు.

55 శాతానికి డిజిటల్ లావాదేవీలు..

2025 నాటికి దేశీయ ఫిన్‌టెక్ మార్కెట్ రూ. 6.2 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. కొన్నేళ్లుగా దేశీయ ఫిన్‌టెక్ పరిశ్రమలో వ్యాపారానికి మెరుగైన అవకాశాలు ఉన్నాయని, కేవలం 5 ఏళ్లలో డిజిటల్ లావాదేవీలు 55 శాతానికి పైగా పెరిగాయని దాస్ పేర్కొన్నారు. 2020లో సుమారు రూ. 274 కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు నిర్వహించినట్టు చెప్పారు. వీటిలో ఎక్కువగా కరోనా మహమ్మారి సమయంలో జరిగాయని దాస్ వెల్లడించారు.

Tags:    

Similar News