చాలా తేడా ఉంది: ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్

దిశ, నిజామాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఆదాయం తగ్గి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు గుదిబండగా మారిన అధిక, తప్పుడు విద్యుత్ బిల్లుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చెపట్టారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయం వద్ద నగర కమిటీ అధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు, మద్య […]

Update: 2020-06-15 02:54 GMT

దిశ, నిజామాబాద్: లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి లేక ఆదాయం తగ్గి ఇబ్బందులు పడుతున్న ప్రజలకు గుదిబండగా మారిన అధిక, తప్పుడు విద్యుత్ బిల్లుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చెపట్టారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజినీర్ కార్యాలయం వద్ద నగర కమిటీ అధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు, మద్య తరగతి ప్రజలకు విద్యుత్ ఛార్జీలు గుదిబండగా తయారయ్యాయని పేర్కోన్నారు. పాత బిల్లులకు కొత్తగా ఏప్రిల్, మే నెలలకు ముడిపెట్టడం వలన అసలు బిల్లులకు, ప్రస్తుత బిల్లులకు చాలా తేడా ఉందన్నారు. వాటిని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, వెల్డింగ్ నారాయణ తదితరులు పాల్గోన్నారు.

Tags:    

Similar News