అస్సోంకు అండగా ఉందాం : ప్రియాంక

అస్సోం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరగ్గా.. చాలా మంది నిరాశ్రయులయ్యారు. మరో వైపు ఖజిరంగా జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నీట మునిగి మూగ జీవాలు సైతం ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అస్సోం ప్రజలను, జంతువులను రక్షించుకునే బాధ్యత తీసుకుందామని పిలుపునిస్తున్నారు యూనివర్సల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. #Assamfloods#PrayForAssam #AssamNeedsHelp You can make a donation here:Rapid Response:https://t.co/4XD4N0vh1f Action Aid: https://t.co/nV858gOGv9 pic.twitter.com/Sn1CoyllYc — PRIYANKA […]

Update: 2020-07-27 05:51 GMT

అస్సోం రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం జరగ్గా.. చాలా మంది నిరాశ్రయులయ్యారు. మరో వైపు ఖజిరంగా జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నీట మునిగి మూగ జీవాలు సైతం ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అస్సోం ప్రజలను, జంతువులను రక్షించుకునే బాధ్యత తీసుకుందామని పిలుపునిస్తున్నారు యూనివర్సల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.

ఇప్పటికే భర్త నిక్ జోనస్, తాను కలిసి విరాళం అందించినట్లు ప్రకటించిన ప్రియాంక.. మీకు తోచినంత సహాయం చేయాలని కోరింది. ప్రజలకు తక్షణ సాయం అందించేందుకు అస్సోంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు పని చేస్తున్నాయని, వాటికి మీరు డబ్బులు పంపిస్తే.. నిరాశ్రయులైన, ఆకలితో అలమటిస్తున్న వారికోసం ఉపయోగిస్తారని తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. పరిస్థితులు చాలా త్వరగా సాధారణ స్థితికి చేరుకోవాలని.. ప్రజలంతా క్షేమంగా ఉండాలని ప్రార్థించాలని కోరింది.

Tags:    

Similar News