సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్న హీరోయిన్.. లవర్ చేసిన పనికి షాక్..
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ ప్రాచీ దేశాయ్ తను డేటింగ్లో ఉన్న వ్యక్తిని సర్ప్రైజ్ చేసేందుకు మరో దేశం వెళ్లానని చెప్పింది. కానీ తను చెప్పింది అబద్ధమని తెలుసుకుని షాక్ అయ్యానని చెబుతూ.. పార్ట్నర్ చెప్పిన మాటలు నమ్మి వెళితే తను అక్కడ లేడని, దీంతో రియలైజ్ అయిన తను ఒంటరిగానే వెకేషన్ ముగించుకుని వచ్చేశానని తెలిపింది. అయితే ఈ విషయంలో తను బాధపడుతున్నానని, ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడ్డానని, ఆ వ్యక్తి లేకపోవడం తనపై ఎలాంటి […]
దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ ప్రాచీ దేశాయ్ తను డేటింగ్లో ఉన్న వ్యక్తిని సర్ప్రైజ్ చేసేందుకు మరో దేశం వెళ్లానని చెప్పింది. కానీ తను చెప్పింది అబద్ధమని తెలుసుకుని షాక్ అయ్యానని చెబుతూ.. పార్ట్నర్ చెప్పిన మాటలు నమ్మి వెళితే తను అక్కడ లేడని, దీంతో రియలైజ్ అయిన తను ఒంటరిగానే వెకేషన్ ముగించుకుని వచ్చేశానని తెలిపింది. అయితే ఈ విషయంలో తను బాధపడుతున్నానని, ఇతరులకు తెలియకుండా జాగ్రత్తపడ్డానని, ఆ వ్యక్తి లేకపోవడం తనపై ఎలాంటి ఎఫెక్ట్ చూపకుండా సెల్ఫ్ ఎంజాయ్మెంట్ చేసేందుకు ప్రయత్నించానని వివరించింది. అలాగే తను ప్రాక్టికల్‌గా ఉంటానని, ఎమోషన్స్ హైడ్ చేస్తానని తెలుపుతూ.. జరిగిన ఇన్సిడెంట్‌తో సీన్ క్రియేట్ చేయడం ఇష్టముండదని, అందుకే కాస్త సమయం తీసుకుని విషయాన్ని వెల్లడిస్తానని చెప్పింది. ఇది కొన్ని సమయాల్లో మంచిది కాకపోయినా.. తను అలాగే వ్యవహరిస్తానంటోంది ప్రాచీ.