40 మంది AAP MLA లను కొనేందుకు BJP ప్రయత్నాలు

న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ 40 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు ప్రయత్నించిందని అన్నారు.

Update: 2022-08-25 10:06 GMT

న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ 40 మంది ఎమ్మెల్యేలు కొనుగోలు ప్రయత్నించిందని అన్నారు. దీని కోసం కాషాయ పార్టీ రూ.800 కోట్లు పక్కన పెట్టుకుందని విమర్శించారు. గురువారం మహాత్మ‌గాంధీ స్మారకం రాజ్‌ఘాట్‌ను సందర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 'డిప్యూటీ సీఎంపై సీబీఐ సోదాలు జరిగిన మరుసటి రోజే కేజ్రివాల్‌కు ద్రోహం చేయాలని, బీజేపీ సిసోడియాకు సీఎం వదవి ఆశ చూపింది. సీఎం పదవిపై ఆశ లేని సిసోడియాను కలిగి ఉండడం అదృష్టం. ఆప్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోవడం కన్నా చావే నయం అనుకుంటారు' అని అన్నారు. 

బీజేపీ అపరేషన్ లోటస్ వైఫల్యం కావాలని ప్రార్థించినట్లు చెప్పారు. కేజ్రివాల్ నివాసంలో జరిగిన సమావేశంలో 12 మంది ఎమ్మెల్యేలు తమ బీజేపీ సంప్రదించినట్లు వెల్లడించారు. అయితే చివరి శ్వాస వరకు ఆప్‌తోనే కొనసాగుతామని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. కాగా, ఈ సమావేశానికి కేజ్రివాల్‌తో సహా 53 మంది నేరుగా హజరు కాగా, ఒకరు వీడియో కాల్ ద్వారా హజరయ్యారు. మరో ఏడుగురు ఇతర ప్రాంతంలో ఉండడంతో సమావేశంలో పాల్గొనలేదు. మరోవైపు సీబీఐ, ఈడీ విచారణలపై ఢిల్లీ అసెంబ్లీ ఆప్ ప్రభుత్వం ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.

Tags:    

Similar News