నార్కో టెస్ట్ కు రెడీ అనే దమ్ముందా చిట్టీ? Vijayasai Reddy ట్వీట్
దిశ, ఏపీ బ్యూరో : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా మాట్లాడుతున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
దిశ, ఏపీ బ్యూరో : హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఓ మహిళతో నగ్నంగా మాట్లాడుతున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వీడియోపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆ వీడియో మార్ఫింగ్ అని ఎంపీ గోరంట్ల మాధవ్ ఇప్పటికే ప్రకటించారు. అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప, ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ కుమార్‌లు కూడా క్లీన్ చిట్ ఇఛ్చేశారు. అయితే టీడీపీ మాత్రం ఈ విషయాన్ని వదలడం లేదు. ఇది ఒరిజినల్ వీడియో అని చెప్తోంది.
దీంతో ఇరు పార్టీలు ఆ వీడియోను బేస్ చేసుకుని విమర్శల దగ్గర నుంచి చివరకు బూతులు తిట్టుకునేవరకు వెళ్లారు. తాజాగా శుక్రవారం ఈ అంశంపై వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేశారు. నీతి సూక్తులు చెప్పేముందు విదేశీ గర్ల్‌ఫ్రెండ్స్‌తో స్విమ్మింగ్ ఫూల్లో జలక్రీడలపై నార్కో టెస్ట్‌కు రెడీనా అంటూ సవాల్ విసిరారు. ' నీతిసూక్తులు చెప్పే ముందు నీ విదేశీ గర్ల్ ఫ్రెండ్సు నడుముకు తాడుచుట్టి కవ్వంలా తిప్పావే.. స్విమ్మింగ్ పూల్ లో హాఫ్ నేక్డ్ గా వాళ్లతో జలక్రీడలు ఆడావే.. వాళ్ళని తీసుకొచ్చి డ్రగ్స్, మద్యం తీసుకోలేదని, అనైతిక పనులు జరగలేదని చెప్పించు పప్పూ. నార్కో టెస్ట్ కు రెడీ అనే దమ్ముందా చిట్టీ?' అంటూ విజయసాయిరెడ్డి లోకేశ్‌కు సవాల్ విసిరారు.