అవమానం: నాలుగు సింహాలను బందీ చేసిన పోలీసులు

దిశ, కోదాడ: భారతదేశంలో ప్రతి పౌరుడు జాతీయ చిహ్నంకు అత్యంత విలువను ఇస్తుంటాడు. భారతీయ చిహ్నం ఎక్కడ కనపడినా ప్రజలు వందనం అందిస్తూ గౌరవప్రదంగా చూసుకుంటారు. భారతీయ చిహ్నం ఎక్కువగా మనకు పోలీస్ స్టేషన్ లో కనిపిస్తూ ఉంటుంది. పోలీసు యూనిఫాంకి కూడా జాతీయ చిహ్నం అమర్చబడి ఉంటుంది. ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం అందించాలనే ఉద్దేశంతో, పోలీస్ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలిగించాలని ప్రభుత్వం, ప్రతి పోలీస్ స్టేషన్ కార్యాలయాలో భారతీయ […]

Update: 2021-08-01 21:51 GMT

దిశ, కోదాడ: భారతదేశంలో ప్రతి పౌరుడు జాతీయ చిహ్నంకు అత్యంత విలువను ఇస్తుంటాడు. భారతీయ చిహ్నం ఎక్కడ కనపడినా ప్రజలు వందనం అందిస్తూ గౌరవప్రదంగా చూసుకుంటారు. భారతీయ చిహ్నం ఎక్కువగా మనకు పోలీస్ స్టేషన్ లో కనిపిస్తూ ఉంటుంది. పోలీసు యూనిఫాంకి కూడా జాతీయ చిహ్నం అమర్చబడి ఉంటుంది. ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం అందించాలనే ఉద్దేశంతో, పోలీస్ వ్యవస్థ పై ప్రజలకు నమ్మకం కలిగించాలని ప్రభుత్వం, ప్రతి పోలీస్ స్టేషన్ కార్యాలయాలో భారతీయ జాతీయ చిహ్నంకు ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసింది. అటువంటి జాతీయ చిహ్నం బందీ కాబడింది.

వివరాల్లోకి వెళితే.. కోదాడ పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్లో లోపలికి వెళ్లే ప్రవేశం ముందు భారత జాతీయ చిహ్నం ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారిపై వెళ్లే ప్రతి ఒక్కరికి భారతీయ జాతీయ చిహ్నం కనిపిస్తూ ఉంటుంది. కానీ పోలీస్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జాతీయ చిహ్నంకు అవమానం జరిగింది. అధికారులు కార్యాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న టెంట్ త్రాడును జాతీయ చిహ్నము చుట్టూ కట్టి పోలీసులు బంధించారు. ప్రజలకు సందేశాలు అందించాల్సిన పోలీసులే ఈ విధంగా ప్రవర్తించడంపై ప్రజల్లో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News