యువత ఆశయాలను NEP నెరవేరుస్తుంది : మోడీ

న్యూఢిల్లీ : నూతన విద్యా విధానంలోని సంస్కరణల అమలు మొదలై ఏడాది గడిచిన సందర్భంగా విధానకర్తలు, స్కిల్ డెవలప్‌మెంట్ నిపుణులు, విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం మాట్లాడారు. ఏడాది కాలంగా నూతన సంస్కరణల అమలుకు కృషి చేసినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సందర్భంగా పలు కార్యక్రమాలనూ ఆయన ప్రారంభించారు. దేశ పురోగతి ప్రస్తుతం పిల్లలకు అందిస్తున్న నాణ్యమైన విద్యపై ఆధారపడి ఉంటుందని అన్నారు. భవిష్యత్‌లో సరికొత్త లక్ష్యాలు సాధించాలంటే విద్య అత్యవసరమని వివరించారు. […]

Update: 2021-07-29 12:09 GMT

న్యూఢిల్లీ : నూతన విద్యా విధానంలోని సంస్కరణల అమలు మొదలై ఏడాది గడిచిన సందర్భంగా విధానకర్తలు, స్కిల్ డెవలప్‌మెంట్ నిపుణులు, విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం మాట్లాడారు. ఏడాది కాలంగా నూతన సంస్కరణల అమలుకు కృషి చేసినవారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇదే సందర్భంగా పలు కార్యక్రమాలనూ ఆయన ప్రారంభించారు. దేశ పురోగతి ప్రస్తుతం పిల్లలకు అందిస్తున్న నాణ్యమైన విద్యపై ఆధారపడి ఉంటుందని అన్నారు. భవిష్యత్‌లో సరికొత్త లక్ష్యాలు సాధించాలంటే విద్య అత్యవసరమని వివరించారు. దేశ తలరాత మార్చే శక్తి నూతన విద్యా విధానాని(ఎన్ఈపీ)కి ఉన్నదని స్పష్టం చేశారు.

దేశ నిర్మాణానికి నిర్వహిస్తున్న మహాయజ్ఞంలో ఎన్ఈపీ కీలక అస్త్రమని చెప్పారు. యావత్ దేశం యువత వెంటే ఉన్నదని, వారి ఆశయాలను నెరవేర్చడానికి సహకరిస్తుందని వారికి ఎన్ఈపీ భరోసానిస్తుందని అన్నారు. గ్రామీణ, గిరిజన, ఇతర ప్రాంతాల్లోని విద్యార్థులు విద్యనభ్యసించడంలో గల అడ్డంకులను తొలగిస్తే ఆకాశాన్ని అందుకుంటారని, ఎన్ఈపీ విద్యార్జనలోని సవాళ్లను తొలగించి ఒత్తిళ్లను తగ్గిస్తుందని వివరించారు. వారికి అనేక అవకాశాలకు ద్వారాలు తెరుస్తుందని తెలిపారు. ఇటీవలే ప్రారంభించిన కృత్రిమ మేథో(ఏఐ)పై కోర్సు భావి అవసరాలకు అనుకుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దుతుందని, ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థకూ పరోక్షంగా ఉపకరిస్తుందని వివరించారు.

విద్యార్థులు ఒకసారి ఒక కోర్సులో చేరిన తర్వాత అందులోనే చివరిదాకా కొనసాగాలన్న నిబంధనను నూతన విద్యా విధానం తొలగించిందని, అందుకే మల్టీపుల్ ఎంట్రీ, ఎగ్జిట్‌ల విధానాన్ని ప్రవేశపెట్టిందని ప్రధాని మోడీ వివరించారు. అలాగే, భాషా సంకెళ్లను తొలగిస్తుందని తెలిపారు. మాతృభాషలో విద్యనభ్యసించే అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పారు. ఇదే సందర్భంగా ఎనిమిది రాష్ట్రాల్లో 14 ఇంజనీరింగ్ కాలేజీలు త్వరలో హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బంగ్లాలో బోధించనున్నట్టు వివరించారు. మాతృభాషలో బోధన గ్రామీణ, గిరిజన, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని చెప్పారు.

సంజ్ఞల భాష..

భారత సంజ్ఞా భాషకు తొలిసారిగా లాంగ్వేజ్ సబ్జెక్ట్‌ హోదానిచ్చినట్టు ప్రధాని మోడీ తెలిపారు. ఇక నుంచి సంజ్ఞల భాషను ఇతర భాషల్లాగే బోధిస్తారని వివరించారు. విద్యార్థులూ ఇతర భాషల్లాగే ఈ భాషనూ చదవగలరని చెప్పారు. ఈ నిర్ణయంతో మూగ, బధిర విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. విద్యాప్రవేశ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. ఎలిమెంటరీ విద్యలో ఈ కార్యక్రమం కీలకపాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. వీటితోపాటు ఏఐ శిక్షణ కోసం ప్రత్యేక వెబ్‌సైట్, నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్, నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరమ్‌ కార్యక్రమాలనూ ప్రారంభించారు.

Tags:    

Similar News