బిగ్ బ్రేకింగ్.. వ్యవసాయ చట్టాలు రద్దు.. మోడీ కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్ : ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్న కారణంగా మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారం ప్రధాని మోడీ ప్రకటించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్టు మోడీ తెలిపారు. దేశంలో రైతుల కోసం తాము మనస్పూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని వెల్లడించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు, రైతులకు మోడీ క్షమాపణ చెప్పారు. అయితే రైతులకు ఉపయోగపడేందుకు తక్కువ […]

Update: 2021-11-18 22:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్న కారణంగా మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు శుక్రవారం ప్రధాని మోడీ ప్రకటించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్రం తీసుకువచ్చిన మూడు చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్టు మోడీ తెలిపారు.

దేశంలో రైతుల కోసం తాము మనస్పూర్తిగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రధాని వెల్లడించారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు, రైతులకు మోడీ క్షమాపణ చెప్పారు. అయితే రైతులకు ఉపయోగపడేందుకు తక్కువ ధరలకే మంచి విత్తనాలను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు.

ఇదిలా ఉండగా నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు సంవత్సరం కాలానికి పైగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ కేంద్రం నిర్ణయాలకు వ్యతిరేకంగా ధర్నాలకు దిగింది.

Tags:    

Similar News