మంటల్లో కాలిపోయిన చారిత్రక గ్రామం.. దిగ్బ్రాంతికి గురైన ప్రధాని మోదీ

దిశ, వెబ్‌డెస్క్ : ఈ రోజు తెల్లవారుజామున హిమాచల్ ప్రదేశ్‌, కులు జిల్లాలోని పురాతన గ్రామమైన మలానాలో జరిగిన అగ్నిప్రమాదంలో డజన్‌కు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. చారిత్రక నేపథ్యం గల ఈ గ్రామం మంటల్లో కాలిబూడిదవ్వడం పట్ల దిగ్భ్రాంతికి గురైన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘హిమాచల్‌ప్రదేశ్‌లోని కులులో జరిగిన అగ్నిప్రమాదం చాలా బాధాకరం. చారిత్రక మలానా గ్రామంలో చోటుచేసుకున్న దుర్ఘటనలో నష్టపోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం […]

Update: 2021-10-27 05:39 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఈ రోజు తెల్లవారుజామున హిమాచల్ ప్రదేశ్‌, కులు జిల్లాలోని పురాతన గ్రామమైన మలానాలో జరిగిన అగ్నిప్రమాదంలో డజన్‌కు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. చారిత్రక నేపథ్యం గల ఈ గ్రామం మంటల్లో కాలిబూడిదవ్వడం పట్ల దిగ్భ్రాంతికి గురైన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘హిమాచల్‌ప్రదేశ్‌లోని కులులో జరిగిన అగ్నిప్రమాదం చాలా బాధాకరం. చారిత్రక మలానా గ్రామంలో చోటుచేసుకున్న దుర్ఘటనలో నష్టపోయిన కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం పూర్తి సంసిద్ధతతో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి’ అంటూ పోస్ట్ చేశారు.

Tags:    

Similar News