గణేష్ నిమజ్జనోత్సవంలో అరాచకం.. ఐదేళ్ల బాలికపై లైంగిక దాడి..?

దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం బర్దిపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం వినాయక నిమజ్జన శోభాయాత్ర జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన ఓ ఐదేళ్ల చిన్నారిపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన మైనర్(17) గ్రామంలోని మసీదు వెనుక ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. అతని నుంచి తప్పించుకొని వచ్చిన చిన్నారి.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో […]

Update: 2021-09-21 06:03 GMT

దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ఐదేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం బర్దిపూర్ గ్రామంలో ఆదివారం సాయంత్రం వినాయక నిమజ్జన శోభాయాత్ర జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వచ్చిన ఓ ఐదేళ్ల చిన్నారిపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన మైనర్(17) గ్రామంలోని మసీదు వెనుక ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. అతని నుంచి తప్పించుకొని వచ్చిన చిన్నారి.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు పేరెంట్స్. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరోవైపు చిన్నారి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారని సదరు మైనర్ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం గమనార్హం.

Tags:    

Similar News