‘అందుకే నోటిఫికేషన్ రద్దు చేయాలి’

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం మాత్రమే ఎస్ఈసీగా నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికలు జరపవచ్చని పిటిషనర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి నిమ్మగడ్డకు అర్హత లేదని పిటిషనర్ పేర్కొన్నారు. గతంలో నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమించినప్పుడు హైకోర్టు తీర్పులో ఇదే ఉందని పిటిషన్‌లో ఆయన తెలిపారు. దీనిపై సుప్రీం కోర్టు కూడా స్టే ఇవ్వలేదని చెప్పారు. అందువల్ల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రద్దు చేయాలని […]

Update: 2021-03-05 01:47 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం మాత్రమే ఎస్ఈసీగా నిమ్మగడ్డ పంచాయతీ ఎన్నికలు జరపవచ్చని పిటిషనర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి నిమ్మగడ్డకు అర్హత లేదని పిటిషనర్ పేర్కొన్నారు. గతంలో నిమ్మగడ్డను ఎస్ఈసీగా నియమించినప్పుడు హైకోర్టు తీర్పులో ఇదే ఉందని పిటిషన్‌లో ఆయన తెలిపారు. దీనిపై సుప్రీం కోర్టు కూడా స్టే ఇవ్వలేదని చెప్పారు. అందువల్ల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రద్దు చేయాలని కోరారు. కాగా పిటిషన్ శనివారం విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News