సర్పంచ్ కోసం సంక్రాంతి ముగ్గుతో నిరసన

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా లోని ముధోల్ సర్పంచ్ రాజేందర్ పై సస్పెన్షన్ వేటు పడినప్పటి నుంచి ముధోల్ రాజకీయం వాడీవేడిగా సాగుతోంది. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ గత కొద్ది రోజుల కిందట సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా రాజేందర్‌ను సర్పంచ్ విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ సుమారు 200 మంది గ్రామస్తులు, మహిళలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తుండగా బైంసా నర్సాపూర్‌లలో ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. పోలీసులు, […]

Update: 2021-01-15 02:30 GMT

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా లోని ముధోల్ సర్పంచ్ రాజేందర్ పై సస్పెన్షన్ వేటు పడినప్పటి నుంచి ముధోల్ రాజకీయం వాడీవేడిగా సాగుతోంది. నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ గత కొద్ది రోజుల కిందట సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. కాగా రాజేందర్‌ను సర్పంచ్ విధుల నుంచి తొలగించడాన్ని నిరసిస్తూ సుమారు 200 మంది గ్రామస్తులు, మహిళలు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తుండగా బైంసా నర్సాపూర్‌లలో ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య స్వల్ప వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. అనంతరం సాయంత్రం వదిలేశారు. ఇదిలాఉంటే ముధోల్ గ్రామానికి చెందిన గ్రామస్తులు పండుగ పూట వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

ముధోల్ సర్పంచ్ రాజేందర్‌ను పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు వెలువడటంతో కొందరు గ్రామస్తులు, మహిళలు వారి ఇంటి ఎదుట సంక్రాంతి శుభాకాంక్షలు రాయడం వదిలేసి మా సర్పంచి మాకు కావాలి, మా సర్పంచ్ రాజేందర్ అని రాసి వినూత్నంగా నిరసన తెలిపారు. అంతకుముందు ఉన్న సర్పంచ్‌లు ఏమీ చేయలేదని, ఇప్పుడున్న సర్పంచ్ వచ్చిన రెండేళ్ల కాలవ్యవధిలో అన్ని పనులు చేస్తున్నాడని చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు ఆయన్ను సర్పంచ్ పదవి నుంచి ఎందుకు తొలగించారో కారణం తెలపాలని మహిళలు ముగ్గులు వేసి డిమాండ్ చేశారు. తమ సర్పంచ్‌ను మళ్ళీ పదవిలోకి తీసుకోవాలని కోరుతూ ముగ్గు మధ్య భాగంలో ‘మా సర్పంచ్ మాకు కావాలి.. రాజేందరన్న జిందాబాద్’ అని రాసుకొచ్చారు. దీనిపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సస్పన్షన్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు.

Tags:    

Similar News