త్వరలో ‘పెళ్లి సందడి 2’

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్‌‌గా ‘పెళ్లి సందడి 2’ చేయనున్నట్లు డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. శ్రీకాంత్ హీరోగా చేసిన పెళ్లి సందడి పెద్ద హిట్ కాగా.. అతని కొడుకు రోషన్‌ను సీక్వెల్‌కు హీరోగా పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేసింది మూవీ యూనిట్. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రానున్న ఈ సినిమాకు గౌరి రోనాంకి దర్శకుడు కాగా.. కీరవాణి స్వరాలు […]

Update: 2020-10-26 08:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లి సందడి సినిమాకు సీక్వెల్‌‌గా ‘పెళ్లి సందడి 2’ చేయనున్నట్లు డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది. శ్రీకాంత్ హీరోగా చేసిన పెళ్లి సందడి పెద్ద హిట్ కాగా.. అతని కొడుకు రోషన్‌ను సీక్వెల్‌కు హీరోగా పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేసింది మూవీ యూనిట్. రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రానున్న ఈ సినిమాకు గౌరి రోనాంకి దర్శకుడు కాగా.. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయక్తంగా సినిమా నిర్మిస్తున్నారు. కాగా అతిలోక సుందరి శ్రీదేవి తనయ ఖుషీ కపూర్ ఈ సినిమాలో సౌందర్య లహరిగా కనిపించబోతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News