ధర్మం విచ్ఛిన్నానికే విగ్రహాల ధ్వంసం : పవన్ కళ్యాణ్

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. దీంతో రామతీర్థం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మం విచ్ఛిన్నానికే శ్రీరాముడి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆలయ ఆస్తుల ధంసానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని […]

Update: 2021-01-02 07:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం జిల్లా రామతీర్థం ఆలయంపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేగుతోంది. దీంతో రామతీర్థం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. తాజాగా ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధర్మం విచ్ఛిన్నానికే శ్రీరాముడి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ఆలయ ఆస్తుల ధంసానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతేగాకుండా ఆలయాల పునరుద్ధరణ బాధ్యతలు కూడా ప్రభుత్వమే తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలపై జరుగుతున్న వరుస ఘటనలను ప్రతిఒక్కరం ఖండించాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News