వంగపండు మృతి కలిచివేసింది : పవన్

దిశ, వెబ్‌డెస్క్ : ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు ఇకలేరనే వార్త తనను చాలా కలిచి వేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్.. వంగపండు తన స్వరాన్ని ప్రజలే కోసమే ఉపయోగించారని గుర్తుచేశారు. ఏపీలో అధికారం రెండు వర్గాల గుప్పెట్లోనే నలిగిపోతోందని ఆగ్రహం, ఆవేదనతో రగిలిన సామాజిక వేత్త వంగపండు అని పేర్కొన్నారు. ఆయనతో తనకు రెండు దశాబ్దాలుగా అనుబంధం ఉందని పవన్ గుర్తుచేశారు. 2009లో ప్రజారాజ్యం కోసం ఆయనతో […]

Update: 2020-08-04 06:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు ఇకలేరనే వార్త తనను చాలా కలిచి వేసిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్.. వంగపండు తన స్వరాన్ని ప్రజలే కోసమే ఉపయోగించారని గుర్తుచేశారు. ఏపీలో అధికారం రెండు వర్గాల గుప్పెట్లోనే నలిగిపోతోందని ఆగ్రహం, ఆవేదనతో రగిలిన సామాజిక వేత్త వంగపండు అని పేర్కొన్నారు.

ఆయనతో తనకు రెండు దశాబ్దాలుగా అనుబంధం ఉందని పవన్ గుర్తుచేశారు. 2009లో ప్రజారాజ్యం కోసం ఆయనతో కలిసి పని చేసిన సందర్భంలో అణగారిన, వెనుకబడిన వర్గాల గురించి ఆయన ఆలోచనలు తనను అమితంగా ఆకట్టుకున్నాయని వివరించారు.జనసేన ఆవిర్భావాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించిన విప్లవ నాయకుల్లో ఆయన కూడా ఒకరని చెప్పారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంగా తనను కలిసి సంఘీభావం తెలిపిన క్షణాలు ఇప్పటికీ గుర్తున్నాయన్నారు.

రాష్ట్రంలో అధికారం.. రెండు వర్గాల చేతుల నుంచి అన్ని వర్గాలకు చేరిన నాడే రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుందని, అదే తన చిరకాల కోరికని తన మనసులోని భావాన్ని వ్యక్తం చేశారని పవన్ తెలిపారు. ఆ కోరిక నెరవేరక ముందే మనల్ని వదిలి ఆయన వెళ్లిపోవడం విషాదకరమన్నారు. ఆయన స్వరం అలసి సొలసి విశ్రమించింది కానీ, వంగపండు ఆశ, ఉత్తరాంధ్ర కొండ కోనల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటుందన్నారు.

Tags:    

Similar News