పరిషత్ ఎన్నికలు నిర్వహించలేం : నిమ్మగడ్డ రమేశ్ కుమార్

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేమని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. కోవిడ్ కేసులు పెరుగుతుండటం, వ్యాక్సిన్ తీసుకోవడం, కోడ్, కోర్టు తీర్పుల వ్యవహారంలో పరిషత్ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలిపారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల అనంతరం ఉద్యోగులు వ్యాక్సిన్ వేసుకోవడంలో నిమగ్నమయ్యారని చెప్పుకొచ్చారు. తాను ఈనెలాఖరున రిటైర్ అవుతున్న తరుణంలో నోటిఫికేషన్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఎన్నికలు నిర్వహించేందుకు సమయం కూడా సరిపోదన్నారు. తదుపరి ఎస్ఈసీ పరిషత్ […]

Update: 2021-03-24 04:46 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పరిషత్ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించలేమని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. కోవిడ్ కేసులు పెరుగుతుండటం, వ్యాక్సిన్ తీసుకోవడం, కోడ్, కోర్టు తీర్పుల వ్యవహారంలో పరిషత్ ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలిపారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల అనంతరం ఉద్యోగులు వ్యాక్సిన్ వేసుకోవడంలో నిమగ్నమయ్యారని చెప్పుకొచ్చారు. తాను ఈనెలాఖరున రిటైర్ అవుతున్న తరుణంలో నోటిఫికేషన్ ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ఎన్నికలు నిర్వహించేందుకు సమయం కూడా సరిపోదన్నారు. తదుపరి ఎస్ఈసీ పరిషత్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తారని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు.

Tags:    

Similar News