Breaking News: ఒంగోలు కోర్టు సంచలన తీర్పు.. 12 మందికి ఉరిశిక్ష

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మున్నా సహా 12 మందికి ఉరిశిక్ష, మరో ఆరుగురికి జీవితఖైదును విధిస్తూ కోర్టు తీర్పును వెలువడించింది. జాతీయ రహదారులపై వెళుతున్న లారీలను అటకాయించి డ్రైవర్లను, క్లీనర్లను కిరాతకంగా  చంపిన నేర చరిత్ర మహమ్మద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నాకు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జిల్లాలో 2008లో హైవే కిల్లర్ […]

Update: 2021-05-24 03:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా హైవే కిల్లర్ మున్నా కేసులో ఒంగోలు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మున్నా సహా 12 మందికి ఉరిశిక్ష, మరో ఆరుగురికి జీవితఖైదును విధిస్తూ కోర్టు తీర్పును వెలువడించింది. జాతీయ రహదారులపై వెళుతున్న లారీలను అటకాయించి డ్రైవర్లను, క్లీనర్లను కిరాతకంగా చంపిన నేర చరిత్ర మహమ్మద్ అబ్దుల్ సమద్ అలియాస్ మున్నాకు ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా జిల్లాలో 2008లో హైవే కిల్లర్ మున్నా కేసు సంచలనం రేపింది. జాతీయ రహదారిపై లారీలు ఆపి దాదాపు 13 మంది డ్రైవర్లు, క్లీనర్లని హత్య చేసింది మున్నా గ్యాంగ్ అని అందరికీ తెలిసిన విషయమే. ఈ కేసులో మొత్తం 18 మందిని నిందితులు‌గా కోర్టు నిర్ధారించింది. వీరంతా దారిదోపిడీలు, హత్యలకు పాల్పడటంతో పాటుగా అందుకు సంబంధించిన ఆధారాలను రూపుమాపినట్లు, ఆయుధాలు కలిగి ఉన్నట్లు నిర్ధారించారు.

Tags:    

Similar News