మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడుదల

ఎనిమిది నెలల నిర్బంధం అనంతరం మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడుదల అయ్యారు. గత ఏడాది ఆగస్టులో ఆర్టికల్ 370, 35ఏ రద్దు, జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తొలగించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కశ్మీర్‌లోని వందల మంది రాజకీయ నాయకులను కేంద్ర ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అందులో ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. గృహ నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఒమర్ సోదరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వెంటనే […]

Update: 2020-03-24 03:13 GMT

ఎనిమిది నెలల నిర్బంధం అనంతరం మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విడుదల అయ్యారు. గత ఏడాది ఆగస్టులో ఆర్టికల్ 370, 35ఏ రద్దు, జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తొలగించి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కశ్మీర్‌లోని వందల మంది రాజకీయ నాయకులను కేంద్ర ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అందులో ఒమర్ అబ్దుల్లా కూడా ఉన్నారు. గృహ నిర్బంధాన్ని సవాల్ చేస్తూ ఒమర్ సోదరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వెంటనే విడుదల చేయాలని కోరింది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఒమర్ అబ్దుల్లాను విడుదల చేసింది.

Tags: omar abdullah, eight months in detention in kashmir

Tags:    

Similar News