తిరుమలలో 'నివర్' ప్రభావం

దిశ, వెబ్ డెస్క్: నివర్ తుపాన్ ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బలమైన గాలులు వీచడంతో చెట్లు విరిగిపడుతున్నాయి. పాపవినాశనం దారిపై కూలిన చెట్లను అటవీశాఖ అధికారులు తొలగించారు. తిరుమల కనుమ మార్గంలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో కునుమ మార్గంలోని హరిణి ప్రాంతంలో రోడ్డుపై బండరాళ్లు జారిపడుతున్నాయి. దీంతో అధికారులు వాటిని జేసీబీల సహాయంతో తొలగిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత […]

Update: 2020-11-25 21:07 GMT

దిశ, వెబ్ డెస్క్: నివర్ తుపాన్ ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. నిన్నటి నుంచి తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బలమైన గాలులు వీచడంతో చెట్లు విరిగిపడుతున్నాయి. పాపవినాశనం దారిపై కూలిన చెట్లను అటవీశాఖ అధికారులు తొలగించారు. తిరుమల కనుమ మార్గంలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. రెండో కునుమ మార్గంలోని హరిణి ప్రాంతంలో రోడ్డుపై బండరాళ్లు జారిపడుతున్నాయి. దీంతో అధికారులు వాటిని జేసీబీల సహాయంతో తొలగిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Tags:    

Similar News