రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీలో విచారణ

దిశ, వెబ్‌డెస్క్: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన ధిక్కరణ పిటిషన్‌పై సోమవారం ఎన్జీటీలో విచారణ జరిగింది. ప్రాజెక్టు పనులు జరపొద్దని ఎన్జీటీ ఆదేశాలిచ్చినా వాటిని ఉల్లంఘించారంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ప్రాజెక్టు పనులు జరపడం లేదని.. కేవలం సమాయత్త పనులు, అధ్యయనాలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాజెక్టు పనులు జరగడం లేదని అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ సర్కారను ఎన్జీటీ ఆదేశించింది. దీనిపై తదుపరి […]

Update: 2020-12-21 02:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై దాఖలైన ధిక్కరణ పిటిషన్‌పై సోమవారం ఎన్జీటీలో విచారణ జరిగింది. ప్రాజెక్టు పనులు జరపొద్దని ఎన్జీటీ ఆదేశాలిచ్చినా వాటిని ఉల్లంఘించారంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కాగా, ప్రాజెక్టు పనులు జరపడం లేదని.. కేవలం సమాయత్త పనులు, అధ్యయనాలు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రాజెక్టు పనులు జరగడం లేదని అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ సర్కారను ఎన్జీటీ ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను జనవరి 18వ తేదీకి ఎన్జీటీ వాయిదా వేసింది.

Tags:    

Similar News