నేపాల్‌కు కొత్త ప్రధాని.. నేడే ప్రమాణ స్వీకారం

దిశ, వెబ్‌డెస్క్ : మన పొరుగున ఉన్న దేశం నేపాల్‌కు కొత్త ప్రధాని రాబోతున్నారు. మంగళవారం ఆ దేశ నూతన ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్‌బా ప్రమాణం చేయనున్నారు. నేపాల్ సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అధికార కమ్యూనిస్టు పార్టీ తరఫున ప్రమాణం చేసేందుకు షేర్ బహదూర్ సిద్ధమయినట్లు తెలుస్తోంది. గతేడాదిలో నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ సిఫారసు మేరకు రాష్ట్రపతి బిద్యా దేవీ భండారీ పార్లమెంటును రద్దుచేసిన విషయం తెలిసిందే. నేపాల్ అధికార కమ్యూనిస్టు […]

Update: 2021-07-12 21:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మన పొరుగున ఉన్న దేశం నేపాల్‌కు కొత్త ప్రధాని రాబోతున్నారు. మంగళవారం ఆ దేశ నూతన ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్‌బా ప్రమాణం చేయనున్నారు. నేపాల్ సుప్రీంకోర్టు తీర్పు అనంతరం అధికార కమ్యూనిస్టు పార్టీ తరఫున ప్రమాణం చేసేందుకు షేర్ బహదూర్ సిద్ధమయినట్లు తెలుస్తోంది. గతేడాదిలో నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ సిఫారసు మేరకు రాష్ట్రపతి బిద్యా దేవీ భండారీ పార్లమెంటును రద్దుచేసిన విషయం తెలిసిందే.

నేపాల్ అధికార కమ్యూనిస్టు పార్టీలో విబేధాలు తలెత్తడంతో నాటి ప్రధాని ఓలీ ఏకపక్షంగా పార్లమెంటు రద్దుకు సిఫారసు చేసినట్లు సుప్రీంకోర్టు భావించింది. దీంతో పార్లమెంటు రద్దు చేస్తూ రాష్ట్రపతి బిద్యాదేవీ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం తప్పుబట్టింది. తిరిగి పార్లమెంటును పునరుద్ధరించాలని ఆదేశాలు చేసింది. చివరకు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఇవాళ నేపాల్ ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్‌బా ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈయన ఇప్పటికే నాలుగుసార్లు నేపాల్ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. తాజాగా ఐదోసారి కూడా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్ ఆయన్ను ప్రధాని అభ్యర్థిగా నామినేట్ చేసింది.

Tags:    

Similar News