బిగ్ బ్రేకింగ్: మాజీ సీఎం శరద్ పవార్ మరో సంచలన నిర్ణయం

ఇటీవల ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శరద పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Update: 2023-05-05 12:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఎన్సీపీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన శరద పవార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కార్యకర్తల డిమాండ్ మేరకు ఆయన తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ఇవాళ ప్రకటించారు. దీంతో మళ్లీ ఎన్సీపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలను పవారే నిర్వహించనున్నారు. కాగా, వయోభారం, పార్టీలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాల దృష్ట్యా శరద్ పవార్ ఈ నెల 3వ తేదీన ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. శరద్ పవార్ తీసుకున్న షాకింగ్ డెసిషన్‌తో ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా కంగుతిన్నారు. పవార్ తన రాజీనామాను వెనక్కి తీసుకోవాలని కార్యకర్తలు, నేతలు డిమాండ్ చేశారు. దీంతో రాజీనామాపై పునరాలోచన చేసేందుకు రెండు, మూడు రోజుల సమయం తీసుకున్న పవార్.. నేతలు, కార్యకర్తల డిమాండ్‌తో వెనక్కి తగ్గి.. తిరిగి ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు వచ్చారు.

Tags:    

Similar News