రిపబ్లిక్ డే స్పెషల్.. ‘గదర్‌’ పాటతో భారత్‌కు రష్యా విషెస్‌ (వీడియో)

రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) సందర్భంగా భారత్‌కు రష్యా స్పెషల్‌గా విషెస్ తెలిపింది. రష్యా ఎంబీసీ వీడియో పోస్ట్..

Update: 2024-01-26 05:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రిపబ్లిక్ డే (గణతంత్ర దినోత్సవం) సందర్భంగా భారత్‌కు రష్యా స్పెషల్‌గా విషెస్ తెలిపింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని రష్యా ఎంబీసీ ఇవాళ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసింది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌ నటించిన ‘గదర్‌’ సినిమాలోని ఓ సూపర్ హిట్‌ సాంగ్‌కు రష్యా ఎంబసీ ఉద్యోగులు ఆడిపాడారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి నృత్యాలు చేసిన వీడియో ఎంబసీ పంచుకుంది.

మరోవైపు ‘గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. రష్యా విత్ లవ్ ’ అని రష్యా ఎంబసీ పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ చేసిన వీడియోకు భారత్ నెటిజన్లు ఇండియా, రష్యా దోస్తిని గుర్తుచేసుకుంటున్నారు.

Full View

Tags:    

Similar News