కాంగ్రెస్ భవిష్యత్ అధ్యక్షుడికి రాహుల్ సలహా

భారత్ జోడో యాత్రలో ఉన్న అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-09-22 10:24 GMT

తిరువనంతపురం: భారత్ జోడో యాత్రలో ఉన్న అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్ర ఉద్దేశం వందల మంది కాంగ్రెస్ కార్యకర్తలను చేర్చుకోవడమనేనని అన్నారు. అయితే మీడియా తనపై దృష్టి పెడుతున్నారని పేర్కొన్నారు. గురువారం కేరళలో 15వ రోజు యాత్రలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'మేము ఈ దేశ సంస్థాగత ఫ్రేమ్‌వర్క్‌ను స్వాధీనం చేసుకున్న యంత్రంతో పోరాడుతున్నాము. అది డబ్బుతో ప్రజలను కొనుగోలు చేయడానికి, ఒత్తిడితో కూడిన బెదిరింపులకు పాల్పడే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

గోవాలో ఎమ్మెల్యేలు పార్టీలు మారడం దాని ఫలితమే' అని కేంద్రాన్ని ఉద్దేశించి విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడికి ఇచ్చే సలహా ఏంటని ప్రశ్నించగా.. భారత్ విజన్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడి పదవి సిద్ధాంతపరమైనది అన్నారు. భారతదేశం ఆలోచనలు, నమ్మక వ్యవస్థ, దృష్టికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. ఉదయ్‌పూర్‌లో చేసుకున్న తీర్మానాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. వన్ పర్సన్, వన్ పోస్ట్ నియమాన్ని పాటిస్తామని తెలిపారు.

Similar News