Coromandel express accident : రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని మోడీ

డిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు ప్రయాణిస్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం రాత్రి 7.20 గంటల సమయంలో పట్టాలు తప్పి గూడ్స్‌ రైలును ఢీకొంది.

Update: 2023-06-03 10:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్‌ నుంచి చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు ప్రయాణిస్తున్న కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ శుక్రవారం రాత్రి 7.20 గంటల సమయంలో పట్టాలు తప్పి గూడ్స్‌ రైలును ఢీకొంది. ఈ ప్రమాదంలో 278 మంది ప్రయాణికులు దుర్మరణం చెందగా.. వెయ్యి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం బాలసోర్‌లోని ప్రమాదం జరిగిన ఘటనా స్థలానికి ప్రధాని నరేంద్ర మోడీ చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులు, రైల్వేశాఖ మంత్రి మోడీకి వివరించారు. ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక రిపోర్టును కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ అందజేశారు. అంతకుమందు ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం రైల్వే మంత్రితో మాట్లాడిన ఆయన బాధితులను అవసరమైన సాయమందించాలని ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలయిన వారికి రూ.50 వేలు పరిహారం ఇస్తామని తెలిపారు.

Also Read:   ఒడిశా రైలు ప్రమాదంపై హై లెవల్ ఎంక్వైరీ కమిటీ వేయాలి.. మాజీ రైల్వే మంత్రి లాలూ 

ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన ప్రధాని మోడీ

Tags:    

Similar News