బెంగాల్ గవర్నర్ పై లైంగిక ఆరోపణలు..!

పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్ రాజ్ భవన్ లోకి ప్రవేశించే వ్యక్తులపై ఆంక్షలు విధించారు.

Update: 2024-05-03 03:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్ రాజ్ భవన్ లోకి ప్రవేశించే వ్యక్తులపై ఆంక్షలు విధించారు. పోలీసులు, ఆర్థిక శాఖ మంత్రి చంద్రిమా భట్టాచార్య రాజ్ భవన్ లోకి ప్రవేశించడాన్ని నిషేదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్‌భవన్‌లోని తాత్కాలిక మహిళా సిబ్బంది గవర్నర్‌ పై ఫిర్యాదు చేసింది. తనపై గవర్నర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు లిఖితపూర్వకంగా పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన కొన్ని గంటలకే ఈ ఉత్తర్వులు జారీ చేశారు బెంగాల్ గవర్నర్. మంత్రి చంద్రిమా భట్టాచార్య పాల్గొనే ఏ కార్యక్రమంలోనూ గవర్నర్ పాల్గొనరని రాజ్ భవన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మంత్రి చంద్రిమాకు వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు భారత టార్నీ జనరల్ ను సంప్రదించారు గవర్నర్.

మహిళై ఉద్యోగిని ఆరోపణలను గవర్నర్‌ ఆనంద బోస్‌ ఖండించారు. సోషల్ మీడియా ఎక్స్ లో గవర్నర్ స్పందిస్తూ..‘ఇది దురుద్దేశంతో అల్లిన కట్టుకథ. ఇదంతా కల్పితమే. ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎవరైనా నన్ను కించపరచడం ద్వారా ఎన్నికల లబ్ధి కోరుకుంటే.. వారికి దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. బెంగాల్‌లో హింస, అవినీతికి వ్యతిరేకంగా నా పోరాటాన్ని ఎవరూ ఆపలేరు’ అని పోస్టులో రాసుకొచ్చారు.

ఇకపోతే, గవర్నర్‌పై వేధింపుల ఆరోపణ వచ్చిన తర్వాత మంత్రి చంద్రిమా భట్టాచార్య తొలిసారిగా స్పందించారు. రాజ్ భవన్ లో అసలేం జరుగుతోంది. ప్రధాని రాష్ట్రానికి వస్తున్న రోజే ఇలా జరగడం దారుణం అని అన్నారు. అయితే, ప్రధాని మోడీ బెంగాల్‌లో రెండు రోజుల పాటు ప్రచారం చేయనున్నారు. ఇలాంటి టైంలో గవర్నర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం బీజేపీకి షాకిచ్చినట్టు అయ్యింది. ఇక, ఈ వ్యవహారంపై అధికార తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు సైతం గవర్నర్‌పై మండిపడుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News