క్వీన్ ఎలిజబెత్‌కు నివాళులు ఆర్పించిన రాష్ట్రపతి

క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియలకు భారత్ తరుఫున హజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్వీన్ భౌతికకాయాన్ని సందర్శించారు.

Update: 2022-09-18 13:43 GMT

లండన్: క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియలకు భారత్ తరుఫున హజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్వీన్ భౌతికకాయాన్ని సందర్శించారు. ఆదివారం దేశ ప్రజల తరుఫున రాష్ట్రపతి వెస్ట్‌మినిస్టర్ హాల్‌లో క్వీన్‌కు నివాళులు ఆర్పించారు. రాష్ట్రపతి ముర్ము తాత్కాలిక హైకమిషనర్ సుజిత్ ఘోష్‌తో కలిసి పాల్గొన్నారు. భారత్ ప్రభుత్వం తరుఫున సంతాప పుస్తకంపై ముర్ము సంతకం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. భారత ప్రజల తరుఫున క్వీన్ కు శ్రద్ధాంజలి ఘటించారని పేర్కొన్నారు. శనివారమే యూకే చేరుకున్న ముర్ము దాదాపు 2,000 ప్రపంచ నేతలతో కలసి సోమవారం క్వీన్ అంతిమ సంస్కారాల్లో పాల్గొనున్నారు. అంతకుముందు ఆమె కింగ్ ఛార్లెస్ ఆహ్వానం మేరకు బంకింగ్ హమ్ ప్యాలెస్‌లోని క్వీన్ కన్సార్ట్ కామిల్లాలో అతిథ్యం స్వీకరించనున్నారు. 



Similar News