PAN – Aadhaar linking : బిగ్ అలర్ట్.. మార్చి 31 తర్వాత మీ పాన్ పనిచేయదు

ఆదాయపు పన్ను శాఖ దేశ పౌరులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు దఫాలుగా.. ఆధార్ కు పాన్ కార్డు లింక్ చివరి గడువు పెంచుతూ వచ్చింది.

Update: 2023-02-15 02:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయపు పన్ను శాఖ దేశ పౌరులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే పలు దఫాలుగా.. ఆధార్ కు పాన్ కార్డు లింక్ చివరి గడువు పెంచుతూ వచ్చింది. తాజాగా మరోసారి అనగా మార్చి 31 లోపు ఆధార్‌తో పాన్ కార్డును ప్రతి ఒక్కరు లింక్ చేసుకొవాలని ఆదాయపు పన్ను శాఖ ఒక సలహాలను జారీ చేసింది. "ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం, మినహాయింపు వర్గం పరిధిలోకి రాని పాన్ హోల్డర్లందరూ తమ పాన్‌ను లింక్ చేయడం తప్పనిసరని తెలిపింది. మార్చి 31 లోపు ఆధార్ కార్డుతో పాన్ లింక్ చేయని వారి పాన్ కార్డు.. పనికిరాకుండా పోతుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి : బ్రేకింగ్ : కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం.. NTR బొమ్మతో రూ.100 కాయిన్

Tags:    

Similar News