ఎన్నికల్లో ఒకే వ్యక్తి ఒకే పదవిని అనుసరించాలి: రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఒకే వ్యక్తి.. ఒకే పదవిని పార్టీ అనుసరించాలని రాహుల్ గాంధీ తెలిపారు.

Update: 2022-09-22 12:36 GMT

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఒకే వ్యక్తి.. ఒకే పదవిని పార్టీ అనుసరించాలని రాహుల్ గాంధీ తెలిపారు. 'మన రాజ్యాంగంలో ఒకే వ్యక్తి.. ఒకే పదవి అనేది లేదని, అధ్యక్ష ఎన్నికల్లో ఎవరైనా పాల్గొనవచ్చని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ చీఫ్ మధుసూదన్ మిస్త్రీ అన్నారు. దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. భారత్ జోడో యాత్రలో భాగంగా గురువారం కేరళలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ ఒకే వ్యక్తి.. ఒకే పదవిని అనుసరించాలని భావిస్తున్నాను.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి పోటీ చేసే వారికి నా సలహా ఒక్కటే. మీరు ఒక చారిత్రాత్మక పోస్టును తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పదవి భారతదేశ ప్రత్యేక దృక్పథాన్ని నిర్వచిస్తుంది. ఇది ఒక వ్యవస్థలోని పదవి కాదు. విశ్వాస వ్యవస్థను సూచించే సైద్దాంతిక పదవి. మీరు భారతీయుల నమ్మకానికి ప్రాతినిధ్యం వహిస్తారు.' అని పేర్కొన్నారు.

Similar News