Mukesh Ambani: ముఖేష్ అంబానీకి బెదిరింపు కాల్స్

Mukesh Ambani, Family Get Threat Calls| పారిశ్రామిక దిగ్గ‌జం, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ ముఖేష్ అంబానీతో సహా ఆయన కుటుంబ సభ్యులకు సోమవారం బెదిరింపు కాల్స్ వచ్చాయి. మూడు నుండి నాలుగు బెదిరింపు కాల్స్ వ‌చ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు

Update: 2022-08-15 09:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: Mukesh Ambani, Family Get Threat Calls| పారిశ్రామిక దిగ్గ‌జం, రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ ముఖేష్ అంబానీతో సహా ఆయన కుటుంబ సభ్యులకు సోమవారం బెదిరింపు కాల్స్ వచ్చాయి. మూడు నుండి నాలుగు బెదిరింపు కాల్స్ వ‌చ్చినట్లు ముంబై పోలీసులు తెలిపారు. గిర్గావ్‌లోని రిల‌య‌న్స్ ఫౌండేష‌న్‌కు చెందిన హ‌రికిష‌న్‌దాస్ ఆస్ప‌త్రి నెంబ‌ర్‌కు ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో రిలయన్స్ ఫౌండేషన్ సిబ్బంది ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బెదిరింపులు జారీ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు అఫ్జల్ గా గుర్తించారు. బెదిరించడం, చంపేస్తానని హెచ్చరించడం, దుర్భాషలాడటం లాంటి సెక్షన్లతో నిందితుడిపై కేసు పెట్టామని, ఫోన్ కాల్స్ చేసిన వ్యక్తి పదేపదే బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. తాను ముకేష్ అంబానీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడని తెలిపారు. ఫోన్ కాల్ రికార్డుల్ని పోలీసులు విన్నారు. అయితే అతను మానసిక రోగి కావచ్చని లేదా ఏదైనా ఒత్తిడితో ఇలా బెదిరించి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మానసిక ఒత్తిడితో ఉన్న వ్యక్తి తన కోపాన్ని వ్యక్తపరిచేందుకు పదేపదే కాల్స్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: దేశం పేరును మార్చండి.. షమీ భార్య హసిన్ జహన్

Tags:    

Similar News