భారత్‌తో సంబంధాలు మెరుగవుతున్నాయి

సరిహద్దుల్లో ఉద్రిక్త వాతవరణ పరిస్థితుల మధ్య చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌తో స్థూల... "Momentum Coming Back": China On Ties With India Amid Border Tensions

Update: 2023-04-01 17:22 GMT

కోల్‌కతా: సరిహద్దుల్లో ఉద్రిక్త వాతవరణ పరిస్థితుల మధ్య చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌తో స్థూల ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి ట్రాక్‌లోకి వస్తున్నాయని చైనా పేర్కొంది. కోల్‌కతాలో చైనా కన్సుల్ జనరల్ జా లియో ఈ విషయాన్ని వెల్లడించారు. బహుళ దేశాల సమావేశాల్లో ఇరు దేశాలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఎస్సీవో సదస్సు అయిన జీ20 సమావేశాలు పాజిటివ్ గా ఉన్నాయని, బాలీ సదస్సులో ఇరు దేశాధినేతలు అద్బుతమైన సంబాషణ జరిగిందని భావిస్తున్నానని అన్నారు. రెండు దేశాలు దౌత్య, సైనిక మార్గాల ద్వారా కమ్యూనికేషన్‌ను కొనసాగిస్తూనే ఉన్నాయని చెప్పారు. గతేడాది నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు కాస్తా మెరుగయ్యాయని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత్ నుంచి స్పందన రావాల్సి ఉంది. ఇరుదేశాల మధ్య గల్వాన్ ఘర్షణ తర్వాత సంబంధాలు బలహీనపడిన సంగతి తెలిసిందే.

Similar News