అమిత్ షా ఫేక్ వీడియోలపై స్పందించిన మోడీ.. వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్

ఎన్నికల వేళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు

Update: 2024-04-29 08:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా చెప్పినట్లుగా కొన్ని ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలను ప్రతిపక్ష పార్టీలు అస్త్రంగా మల్చుకుని బీజేపీపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోన్న అమిత్ షా ఫేక్ వీడియోలపై ప్రధాన నరేంద్ర మోడీ స్పందించారు. ఈ ఇష్యూపై సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఫేక్ వీడియోలు సృష్టించేవాళ్లకు తగిన గుణపాఠం చెబుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇలాంటి చర్యలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓడిన వాళ్లే ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అమిత్ షా ఫేక్ వీడియోల వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, బీజేపీల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమిత్ షా ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు పడ్డారు. 

Read more : రిజర్వేషన్లు రద్దు’.. అమిత్‌షా ఫేక్ వీడియో గుర్తింపు.. కేసు నమోదు 

Tags:    

Similar News