రాష్ట్రపతికి క్షమాపణలు తెలిపిన బెంగాల్ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రపతి ద్రౌపదిముర్మును ఉద్దేశించి తమ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

Update: 2022-11-14 13:47 GMT

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రపతి ద్రౌపదిముర్మును ఉద్దేశించి తమ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అఖిల్ గిరి చేసిన వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా, ముర్ముకు క్షమాపణలు తెలియజేశారు. అయితే ఇలాంటి అగౌరవపరిచే వ్యక్తిగత కామెంట్లు చేయడం తమ పార్టీ సంస్కృతి కాదని తెలిపారు. ఇప్పటికే సదరు నేతకు దీనిపై సూచనలు చేశామని, తన పార్టీ కూడా క్షమాపణలు చెప్పిందన్నారు. అందం అంటే చూపుకు కనిపించేంది కాదని, లోపలి నుంచి ఎలా ఉన్నామనేదని చెప్పారు.

కాగా, అంతకుముందు బీజేపీ నేతలు టీఎంసీ మంత్రి అఖిల్ గిరి వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్‌భవన్ వరకు మార్చ్ చేపట్టారు. రెండు రోజుల క్రితం గిరి ఓ సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రపతిని ఉద్దేశించి చూడటానికి ఎలా ఉంటుంది అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కాస్తా వైరల్‌గా మారడంతో బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. దీంతో రాష్ట్రపతికి గిరి క్షమాపణలు చెప్పారు.

Similar News