ఝార్ఖండ్ మాజీ సీఎంకు చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ కు నిరాకరణ

ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు కోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు నిరాకరించింది.

Update: 2024-04-27 10:14 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ కు కోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు రాంచీలోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు నిరాకరించింది. తన మామ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 13 రోజుల మధ్యంతర బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించారు హేమంత్ సోరెన్. అందుకు బెయిల్ మంజూరు చేసేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించింది. దీంతో మరోసారి హేమంత్‌కు నిరాశ తప్పలేదు.

మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు హేమంత్‌ సోరెన్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. తర్వాత కోర్టులో హాజరుపరచగా.. జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆయన్ను జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే తన వారసుడిగా చంపయ్ సోరెన్ ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నారు. ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఝార్ఖండ్ లోని గాండే అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికలో ఆమె పోటీ చేస్తున్నారు. గతంలో హేమంత్ సోరెన్ రాజీనామా చేసినప్పుడు.. కల్పనానే సీఎం పదవిలో ఉంటారని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో ప్లాన్ రివర్స్ అయ్యింది. అభ్యంతరాలు రావడంతో వెనక్కి తగ్గారు.

Similar News