అమిత్ షా స్క్రిప్ట్ చదవకుండా వాస్తవాలు తెలుసుకుంటే బాగుంటేది!.. చామల కిరణ్ కౌంటర్

అమిత్ షా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివే బదులు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-05-09 15:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అమిత్ షా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివే బదులు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవ్వాళ భువనగిరి సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆయన బీజేపీ పై తీవ్ర విమర్శలు చేశారు. అమిత్ షా భువనగిరి సభలో గత పదేళ్లలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రజలను లూటీ చేసి 9 లక్షల కోట్లు అప్పు చేసి, దొంగతనం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లు చూస్తు ఎందుకు వదిలేశారో చెప్పలేదని మండిపడ్డారు.

కేవలం కుల మాతాలకు చిచ్చు పెట్టే విధంగా, మైనారిటీలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీలను దగ్గరకు చేసుకునే విధంగా వారు మాట్లడటం అర్ధం లేకుండా ఉందని ఎద్దేవా చేశారు. అలాగే తన గురించి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ కోటరీ పని చేశానని, రాహుల్ గాంధీ చెంచా అని అంటున్నారని.. హోం మినిస్టర్ హోదాలో ఉండి వాస్తవాలు తెలుసుకుంటే బాగుండేదని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వాళ్లు ఎవరూ అడగని టికెట్ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చారని మాట్లాడుతున్నారని.. 25 మంది కాంగ్రెస్ అభ్యర్ధులను కాదని పార్టీ ఒక సైనికుడినని, యూత్ కాంగ్రెస్ లీడర్ గా పని చేశానని, ఎన్ఎస్‌యూఐ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన నాకు టికెట్ కేటాయించిందని చెప్పారు.

కానీ బీజేపీ ఒక ఫెయిల్ బీఆర్ఎస్ ఎంపీ అయిన బూర నర్సయ్య గౌడ్ కి టికెట్ ఇచ్చిందని, ప్రైవేట్ హాస్పిటల్స్ కు కొమ్ము కాసి ఎయిమ్స్ హాస్పిటల్ ను నిర్విర్యం చేసిన వ్యక్తికి టికెట్ ఇచ్చారని దుయ్యబట్టారు. బీజేపీకి సొంత పార్టీలో ఎవరూ దొరకక కొత్త వాళ్లని తెచ్చుకొని టికెట్ ఇచ్చిన మీకు మా గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ దోపిడిని ఎందుకు ఆపలేదో చెప్పకుండా.. గత పదేళ్లో ఏం చేశామో.. రానున్న ఐదేళ్లలో కుల మతాలకు అతీతంగా పేద ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని చామల అన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News