మలద్వారంలో రూ.70 లక్షల బంగారం.. లావెటరీలో రూ.85 లక్షల గోల్డ్

దిశ, నేషనల్ బ్యూరో : ఓ ప్రయాణికుడి మలద్వారం నుంచి ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు రూ.70.58 లక్షలు విలువైన 977 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Update: 2024-04-27 12:11 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఓ ప్రయాణికుడి మలద్వారం నుంచి ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అధికారులు రూ.70.58 లక్షలు విలువైన 977 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో దుబాయ్‌ నుంచి తిరుచ్చికి ప్రయాణిస్తున్న వ్యక్తిని తమిళనాడులోని తిరుచిరాపల్లి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అతడిని తనిఖీ చేయగా మలద్వారంలో మూడు గోల్డ్ పేస్టు ప్యాకెట్లు దొరికాయి. ఈ పేస్ట్ మెటీరియల్ బరువు 1081 గ్రాములు ఉన్నట్లు గుర్తించారు. దాన్ని ల్యాబ్‌లో టెస్టు చేయగా 977 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఉన్నట్లు వెల్లడైంది. మరో ఘటనలో, చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు అంతర్జాతీయ టెర్మినల్‌లోని అరైవల్ లాంజ్‌లో ఉన్న లావెటరీలో 1.25 కిలోల బంగారాన్ని గుర్తించారు. దాని విలువ రూ.85 లక్షలు ఉంటుంది. లావెటరీలోని ఓ వాష్ రూంలో ఉన్న చెత్తకుండీలో మూటను తెరిచి చూడగా గోల్డ్ బయటపడింది. ముఖాన్ని కప్పుకున్న ఓ ప్రయాణికుడు ఆ సంచిని డస్ట్‌బిన్‌లో వేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో వెల్లడైంది.

Tags:    

Similar News