చైనా, ఇండియా సంబంధాలు అసాధారణం.. జైశంకర్

దిశ, వెబ్‌డెస్క్: భారత కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి చైనా, ఇండియా సంబంధాల గురించి..

Update: 2022-08-13 03:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి చైనా, ఇండియా సంబంధాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు నార్మల్ కాదని జైశంకర్ అన్నారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో పాల్గొన్న జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'భారత్, చైనాల మధ్య సరిహద్దు సమస్య సాధారణం కాదు. కాబట్టి ఈ దేశాల మధ్య సంబంధాలు నార్మల్ కాలేవు' అని జైశంకర్ అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని చైనా చెడగొట్టింది, ఇవి ఇరుదేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేస్తాయని ఆయన అన్నారు. అంతేకాకుండా సరిహద్దు ప్రదేశంలో భారత భూభాగాన్ని భారత మిలటరీ తన స్వాధీనంలో ఉంచుకుందని చెప్పుకొచ్చారు.

Similar News